BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 12:52 pm
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

పుట్టినరోజు వేడుకల పేరుతో మహిళను తీసుకెళ్లి హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / ఆంధ్రప్రదేశ్ / తూర్పు గోదావరి
01 Sep, 2026 - 12:52 PM
60 వీక్షణలు

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొరుకొండ పోలీసులు

కొరుకొండ | Ntoday News

పుట్టినరోజు వేడుకల పేరుతో ఓ మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను కొరుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన స్కూటీ, సుత్తి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం కప్పల వారి వీధికి చెందిన గెడ్డం ధనలక్ష్మి అలియాస్ శాంతి (28) గాడాల గ్రామానికి చెందిన మట్టాడి దేవి ప్రసాద్తో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే వీరి సంబంధాన్ని దేవి ప్రసాద్ అన్నయ్య మట్టాడి అయ్యప్ప వ్యతిరేకిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ పరువు పోతుందనే కారణంతో శాంతిపై దాడికి సోదరులిద్దరూ పథకం వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 25న రాత్రి అయ్యప్ప పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని శాంతిని నమ్మించి గాడాల గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అక్కడ మద్యం సేవించిన అనంతరం దేవి ప్రసాద్ బాధితురాలి చేతులను వెనక్కి పట్టుకోగా, అయ్యప్ప సుత్తితో ఆమె తల, చెవిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను స్కూటీపై సింహాచలనగర్ సమీపంలోని క్వారీ వద్దకు తీసుకెళ్లి, మెడకు తీగ చుట్టి చనిపోయిందని భావించి క్వారీలో పడేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.

అయితే కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కొరుకొండ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.198/2026 కింద BNS సెక్షన్లు 109(1), 137, 238 r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు.

నార్త్ జోన్ డీఎస్పీ సిహెచ్. జీవన సూచనలతో, కొరుకొండ సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఆగస్టు 30న సాయంత్రం 6 గంటలకు గాడాల గ్రామంలో నిందితులు **A1 మట్టాడి దేవి ప్రసాద్ (25), A2 మట్టాడి అయ్యప్ప (27)**ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన స్కూటీ, సుత్తి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాలను డీఎస్పీ అభినందించారు. ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.