BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 23 May 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:35 PM
180 వీక్షణలు

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ కలుపు మందు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా విస్సన్నపేట మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, సుమారు 2250 లీటర్ల ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ స్టాకులపై “స్టాప్ సేల్” ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లలో అప్రమత్తత నెలకొంది.

అలాగే మండలంలోని పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ మందును కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రైతుల భద్రత, పంటల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.