BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:22 pm
Posted by : PAGADALA DEVAIAH

అర్హులైన వృద్ధ పురుషులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
18 Nov, 2026 - 05:22 PM
23 వీక్షణలు

సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్‌.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

తాడూరు, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): మండలంలోని వివిధ గ్రామాల్లో వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పురుషులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అనేక గ్రామాల్లో వృద్ధాప్యం వచ్చినప్పటికీ అర్హులైన పురుషులకు పింఛన్లు అందడం లేదని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధులు కుటుంబంపై ఆధారపడకుండా జీవించేందుకు ప్రభుత్వం అందించే పింఛన్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.

పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి అర్హతలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకులు కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్లు అందని అర్హులైన వృద్ధులను గుర్తించి, వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించి అర్హులైన వృద్ధులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేస్తామని అంతటి కాశన్న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం తాడూరు శాఖ కార్యదర్శి ఎన్. పోతుల కాశన్న, చిన్న శ్యాంసుందర్, రాములు, కృష్ణయ్య, చంద్రయ్య, బోనాసి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.