ఫాస్టాగ్ వినియోగదారులకు శుభవార్త.. ఇక ట్యాగ్ మార్చాల్సిన అవసరం లేదు
ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకును మార్చుకోవాలంటే వాహనంపై ఉన్న ఫాస్టాగ్‌ను తొలగించి కొత్త ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే ఫాస్టాగ్ ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ప్రారంభించారు.
ప్రస్తుతం ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకు సేవలు వినియోగదారులకు నచ్చకపోతే, ఇకపై వాహనంపై ఉన్న ట్యాగ్‌ను మార్చకుండానే మరో బ్యాంకుకు ఫాస్టాగ్ ఖాతాను మార్చుకోవచ్చు. దీంతో కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోవడంతో వినియోగదారులకు సమయం, ఖర్చు ఆదా కానుంది.