BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 06:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పరిటాలలో క్వారీలు, క్రషర్లతో కాలుష్యం.. రైతుల అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఐ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Sep, 2026 - 06:19 PM
8 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలోని క్వారీలు, క్రషర్ల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ ఆరోపించారు. క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

హనుమాన్‌పేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్, రెవెన్యూ అధికారులు నిర్వహించిన సమావేశంలో తమ పొలాల్లో దుమ్ము, ధూళి పడటంతో పంటలు పండడం లేదని ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు.

బాధిత రైతులకు అండగా నిలిచి సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం క్వారీలు, క్రషర్ల యజమానులకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అనుమతుల గడువు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని క్వారీలు, క్రషర్లు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

పరిమితికి మించి బ్లాస్టింగ్‌లు నిర్వహించడం వల్ల పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, క్వారీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్వారీలు, క్రషర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగి తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లంకా గోవిందరాజులు పాల్గొన్నారు.