BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 02:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 02:24 PM
172 వీక్షణలు

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది: పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మోరంపూడి శ్రీనివాసరావు

చనుబండ: రైతు సంక్షేమమే లక్ష్యంగా చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తుందని పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చనుబండ పీఏసీఎస్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతుల అభివృద్ధి కోసం సహకార సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. చనుబండ పీఏసీఎస్‌ పరిధిలోని గ్రామాల రైతుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.

రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు వివిధ రకాల రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరలకు కొనుగోలు చేసి, చెల్లింపులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం పాలకవర్గ సభ్యులు కంచు మల్లయ్య, ప్రభాకరరావు, బీజేపీ జిల్లా కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, పరసా శ్రీను, గుడిమళ్ల బ్రహ్మయ్య, ఫిరంగి పుల్లయ్య, రైతులు గవర వెంకటేశ్వరరావు, బన్నే వీరాస్వామి, కందుల శివయ్య, మిద్దె చెన్నారావు, సంఘం సిబ్బంది వెంకటేశ్వరరావు, శ్రీను, దుర్గారావు, రియాజ్‌, ఉపాధ్యాయులు షెహనాజ్‌, మోదుగు రవి, విద్యార్థులు పాల్గొన్నారు.