BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 13 May 2026, 08:52 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 08:52 PM
129 వీక్షణలు

రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​గొల్లపల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సందర్శన

​లారీ ప్రమాద బాధితులకు పరామర్శ

​కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

​గొల్లపల్లి, (ప్రజా లక్ష్యం ప్రతినిధి):

మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల జరిగిన లారీ ప్రమాద ఘటనపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించారు. ప్రమాదంలో రైతులు గాయపడటంతో పాటు, మోటార్ సైకిళ్లు దెబ్బతిన్న విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు.

​ఈ సందర్భంగా మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వారిని పరామర్శించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

​అధికారులకు కీలక ఆదేశాలు:

​కేంద్రం వద్ద మొక్కజొన్న నిల్వలు పెరగకుండా, రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

​వైద్య సహాయం: ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతుకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

​భద్రతా చర్యలు: కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

​ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు