BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 11:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లికి వందనం పథకం: జులై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:29 PM
118 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. గతంలో జులై మూడో వారంలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అంతకంటే ముందుగానే జులై 10న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పథకం కింద ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

అయితే, నిధులు సకాలంలో అందుకోవాలంటే తల్లులు, విద్యార్థులు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే జులై 10న ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు జమ కానున్నాయి.

ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. తల్లులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ వివరాలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.