BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 11:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెంలో రేషన్‌ షాప్‌–9పై ఆకస్మిక తనిఖీ సరుకుల నిల్వల్లో వ్యత్యాసాలు.. డీలర్‌ సస్పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 11:15 PM
69 వీక్షణలు


ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం, సెప్టెంబర్‌ 3: మండల కేంద్రంలోని రేషన్‌ షాప్‌ నంబర్‌–9పై పౌరసరఫరాల అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రేషన్‌ షాప్‌–9కు సంబంధించి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ డీటీ నాగరాజు, ఆర్‌ఐ ప్రసాద్‌ బుధవారం దుకాణాన్ని తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా రేషన్‌ దుకాణంలో ఉన్న బియ్యం, పంచదార, గోధుమపిండి తదితర నిత్యావసర సరుకుల నిల్వలు, ప్యాకెట్లను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో సరుకుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రికార్డుల్లో నమోదైన నిల్వలకు, వాస్తవంగా దుకాణంలో ఉన్న సరుకులకు మధ్య తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

తనిఖీ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో రేషన్‌ షాప్‌ నంబర్‌–9 డీలర్‌ పోతురాజు శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దుకాణ నిర్వహణ బాధ్యతలను రేషన్‌ షాప్‌ నంబర్‌–10 డీలర్‌ మాతంగి బాబురావుకు ఇన్‌చార్జిగా అప్పగించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించడం, అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకోవడం ద్వారా రేషన్‌ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.