BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 08:27 pm
Posted by : V శ్రీనివాస్

రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 08:27 PM
122 వీక్షణలు

మంచిర్యాల తోళ్ల. వాగులో అధునాతన వాషింగ్ ప్లాట్ నిర్మించాలి.

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం.సర్వే

మంచిర్యాల టౌన్ రజక వృత్తిదారుకు ఆధునిక మేకనైజేడ్ దోబీ ఘాట్ నిర్మించి రజక వృత్తిదారుల ఉపాధి కల్పించాలి.

మంచిర్యాల తోల్లవాగు రజక వృత్తి చేస్తున్న వృత్తిదారులను కలిసి వారి సమస్యలను సర్వే చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న సంప్రదాయ వృత్తిదారులకు సరైన వస్తువులు లేక గ్రామ, మండలాలలో వృత్తి పనులు వదిలేసి కూలీలుగా మారుతున్నారని ఆయన తెలిపారు. రజక వృత్తిలో కూడా మారిన ఆధునిక పద్ధతులను రజక వృత్తిదారులకు తెలియపరచి ప్రభుత్వ సహకారంతో మోడ్రనైజ్ చేసి ఆధునిక పరికరాలు వాషింగ్ మెషిన్లు, శారీ రోలింగ్, ఇస్త్రీ చేసే కరెంటు పెట్టెలు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆశయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల, జిల్లాలలో వాగులను వెళ్లి చెరువులు, గోదావరి నది ప్రాంతంలో బట్టలు జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయని వారందరికీ మోడరన్ ధోబి గాడ్ లభించి ఆదుకోవాలని తెలపడం జరిగింది. తెలంగాణ ఏర్పడి 12 అయినా బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని తెలిపారు. చదువుకున్న రజక పిల్లలకి బీసీ ఏ రిజర్వేషన్లు ఉద్యోగాలు కల్పించాలని, రక్షణ చట్టం లాంటి చట్టాలు చేయాలని రజకుల నుంచి విన్నపాలు వస్తున్నాయని వాటన్నిటిని ప్రభుత్వాలు పరిష్కరించాలని ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. 

ఈ కార్యక్రమాలు ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరల రాములు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో సింగరేణి మండలాల సంబంధించి ధోబిఘాట్ లేకపోవడంతో వృత్తిదారులు తమ ఇండ్లలోనే వృత్తి చేస్తూ ఇబ్బంది పడుతున్నారని జిల్లా వ్యాప్తంగా మోడల్ దోబిగాట్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల రజకులకు అందించాలని కోరడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్ కొండపర్తి బాబు, తేజ, ముత్తునూరు శంకర్, కుదురుపాక మల్లేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.