BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 20 August 2026, 03:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:28 PM
80 వీక్షణలు

దాదాపు మూడు దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడింది. రూ.20 లంచం ఆరోపణల కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

1996లో విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 నగదు లభించగా, క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 దొరకలేదు.

అయితే లంచం డిమాండ్ చేసినట్లు నిరూపించే బలమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ పలు వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించింది.

కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారనే కారణంతోనే లంచం డిమాండ్, స్వీకరణ జరిగినట్లు నిర్ధారించలేమని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నేర నిర్ధారణకు అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది.

దీంతో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను కొట్టివేసి.. క్లర్క్, ప్యూన్ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు లభించింది.