BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 22 September 2026, 02:17 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అరెస్ట్‌కు కారణం చెప్పాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Sep, 2026 - 02:17 PM
58 వీక్షణలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: అరెస్టు చేసే సమయంలో వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో స్పష్టంగా తెలియజేయడంతో పాటు, ఆ కారణాలను రాతపూర్వకంగా, అరెస్టయిన వ్యక్తికి అర్థమయ్యే భాషలో అందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) కింద అరెస్టయిన వ్యక్తికి తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే ప్రాథమిక హక్కు ఉందని కోర్టు పేర్కొంది. అరెస్టుకు సంబంధించిన కారణాలు వ్యక్తిగతంగా, స్పష్టంగా ఉండాలని తెలిపింది. సాధారణంగా వర్తించే కారణాలను మాత్రమే అరెస్ట్‌ మెమోలో పేర్కొనడం సరిపోదని స్పష్టం చేసింది.

అరెస్టు కారణాలను రాతపూర్వకంగా అందించడం ద్వారా వ్యక్తికి తనపై తీసుకున్న చర్యను అర్థం చేసుకునే అవకాశం, న్యాయపరమైన పరిహారం కోరే అవకాశం లభిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ సమాచారాన్ని సంబంధిత వ్యక్తి అర్థం చేసుకునే భాషలో అందించడం కూడా కీలకమని తెలిపింది.

నిబంధనలు పాటించకపోతే అరెస్ట్ చెల్లదా?

అరెస్టుకు సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలను పాటించకపోతే ఆ అరెస్టు చట్టపరంగా నిలబడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనలపై సంబంధిత అధికారుల బాధ్యతను కూడా పరిశీలించాల్సి ఉంటుందని తాజా తీర్పులో పేర్కొంది.

అరెస్టు సమయంలో వ్యక్తి హక్కులను కాపాడటం, దర్యాప్తు సంస్థలు రాజ్యాంగపరమైన విధానాలను పాటించడం తప్పనిసరి అని కోర్టు తాజా తీర్పు మరోసారి స్పష్టం చేసింది.