అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరిపెడ యువతి దుర్మరణం
అంతర్జాతీయం
మరిపెడ: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. ఈ ఘటనతో ఆమె స్వగ్రామంలో విషాదం నెలకొంది.
సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ, రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు కారులో ఉన్న స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు.
సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.