పెరక సంఘం భవనానికి రూ.20 లక్షల మంజూరు..
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంచిర్యాల జిల్లా పెరక సంఘం నాయకులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెరక సంఘం భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు ప్రేమ్ సాగర్ రావును శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా పెరక సంఘం అధ్యక్షుడు బొడ్డు శంకర్, పెరక ట్రస్ట్ బీఆర్ లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు తిరుపతి, వైద్యులు బొడ్డు రఘునందన్, ముత్తినేని అనిల్ కుమార్, పెరక జిల్లా నాయకులు మానయ్య, చుంచు సదానందం, గూడ గోపి, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల జిల్లా ఓబీసీ చైర్మన్ వొడ్డే రాజమౌళి, ఆర్జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కొనసాగుతున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ నమోదైంది.