BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:30 pm
Posted by : DAVU RAVINDER REDDY

కమిషనర్ ని కలిసి చెరువు కష్టాలు చెప్పిన గ్రామస్తులు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 10:30 PM
0 వీక్షణలు

చెరువుల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్

ఘట్కేసర్ / Ntoday News: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని లక్ష్మీ నారాయణ చెరువును కాపాడాలని అక్కడి స్థానికులు, మత్స్యకారులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం చెరువును ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త, హైడ్రా అడిషనల్ కమిషనర్ డి. ఆనంద్ కుమార్ తో కలిసి హైడ్రా కమిషనర్ సందర్శించారు. గణేష్ నిమజ్జనానికి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు పెద్దమొత్తంలో హైడ్రా కమిషనర్ను కలిసి.. చెరువు చరిత్రను వివరించారు. కాలుష్యం భారిన పడిన చెరువును కాపాడాలని కోరారు. 600ల ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు తాగునీరు, సాగునీరు అందించేదని.. ఇప్పుడు కలుషితమైపోయిందని వాపోయారు. నగరంలో పలు చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడంతో పరిసరాల రూపురేఖలు మారిపో యాయని.. ఆ క్రమంలోనే ఏదులాబాద్లోని లక్ష్మీనారాయణ చెరువును కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ చెరువు నీటిని తాకితే చేతులకు జిగురులా అంటుకుంటోందని.. అంతటి స్థాయిలో కాలష్యం ఉండడంతో ఇందులో చేపలు చనిపోయాయన్నారు. చుట్టుపక్కల బోర్లలో కలుషిత జలాలు వచ్చి బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, సంతానలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. పైన ఉన్న జవాహర్ నగర్ డంప్ యార్డు వ్యర్థాలు మురుగు నీరుద్వారా చెరువులో కలిసి జలాలు కలుషితం అయ్యాయని వాపోయారు. జవహార్నగర్ నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కి కలవకుండా నాలాను డైవర్ట్ చేస్తే చాలావరకు సమస్య పరిష్కారమౌతుందని తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువును బాగు చేసేందుకు త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని హైడ్రాకమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు.

చెరువుల అభివృద్ధి పూర్తి కావాలి..

ఉప్పల్ నల్లచెరువు, నాచారం చెరువు, రామంతాపూర్ లోని పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు.

ఉప్పల్ నల్లచెరువును నవంబరులో ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారని.. ఇప్పటికి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా అని కోరారు. చెరువు అభివృద్ధిలో భాగంగా సెడిమెంటేషన్ ట్యాంకులను, చెరువు కట్టతో పాటు.. ఇన్లెట్లు, ఔట్లెట్లను పరిశీలించారు. చెరువు చెంత ప్రభుత్వ భూమికి చెందిన సర్వే నంబరు 155లో తాత్కాలిక షెడ్డులను ఖాళీ చేయించి వెండర్లకు అక్కడ అవకాశం కల్పించేందుకు తాము ప్రయత్ని స్తున్నామని.. ఇందుకు హైడ్రా సహకరించాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త కమిషనర్ను కోరారు. చెరువుల అభివృద్ధిని విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ కమిషనర్కు వివరించారు. ఉప్పల్ నల్లచెరువు చుట్టూ బయోడైవర్సిటీని పెంపొందించాలని సూచించారు. నాచారం చెరువు చుట్టూ పాత్వేపైకి వాహనాల రాకపోకలు సాగిస్తుండడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని.. వాటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.