తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా సాముల రామ్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా సాముల రామ్‌రెడ్డి ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సాముల రామ్‌రెడ్డి చైర్మన్‌గా, చలకాని వెంకట్ యాదవ్ వైస్ చైర్మన్‌గా, జి. కిరణ్ కుమార్ భారత బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో సాముల రామ్‌రెడ్డికి 12 ఓట్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ గౌడ్‌కు 11 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రామ్‌రెడ్డి విజయం సాధించారు.
వైస్ చైర్మన్ పదవికి చలకాని వెంకట్ యాదవ్‌కు 13 ఓట్లు, జకీర్ హుస్సేన్ జావెద్‌కు 10 ఓట్లు పోలయ్యాయి. దీంతో మూడు ఓట్ల ఆధిక్యంతో వెంకట్ యాదవ్ గెలుపొందారు. భారత బార్ కౌన్సిల్ సభ్యుడి స్థానానికి జరిగిన ఎన్నికలో జి. కిరణ్ కుమార్, జగదీశ్వర్ రావుపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 30న ఎన్నికలు నిర్వహించగా, ఓట్ల లెక్కింపు మార్చి 24న పూర్తయింది.