ప్రాణహిత స్టేడియం సమస్యలు పరిష్కరించాలని క్రీడాకారుల వినతి
వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్‌లో ఉన్న ప్రాణహిత స్టేడియంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్రీడాకారులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు వినతి పత్రం అందజేశారు.
స్టేడియంలో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. క్రీడా సాధనకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
క్రీడాకారుల వినతిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించారు. ప్రాణహిత స్టేడియంలోని సమస్యలను పరిశీలించి అతి త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.