BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 28 March 2026, 05:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సుంకొల్లులో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 05:50 AM
189 వీక్షణలు

సుంకొల్లులో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి – 9 మంది అరెస్ట్, నగదు, వాహనాలు స్వాధీనం

ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడి పందాల స్థావరంపై నూజివీడు రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. నూజివీడు రూరల్ ఎస్ఐ జ్యోతి బసు తమ సిబ్బందితో కలిసి ఈ దాడి చేపట్టారు.

నూజివీడు రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, కోడిపందాల నిర్వాహకులకు గట్టి షాక్ ఇచ్చారు. ఎస్ఐ జ్యోతి బసుకు అందిన పక్కా సమాచారం మేరకు సుంకొల్లు గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

పోలీసుల రాకను గమనించిన జూదగాళ్లు అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా, పోలీసులు చాకచక్యంగా చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుండి రూ. 6,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెం రాయుళ్లకు చెందిన 11 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో 3 కోడి పుంజులు, 2 కోడి కత్తులను కూడా పోలీసులు రికవరీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ జ్యోతి బసు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ యువతను వ్యసనాల వైపు మళ్లించే కోడి పందాలు, పేకాట వంటి జూద కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ కెమెరాల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే రౌడీషీట్లు కూడా తెరవడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా సహకరించాలని ప్రజలను కోరారు.