BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:54 pm
Posted by : K MAHESH

తాత జ్ఞాపకార్థం రూ.2 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 06:54 PM
23 వీక్షణలు

ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్లు, రోగులకు దుప్పట్లు.. పాఠశాలకు ప్రొజెక్టర్లు, క్రీడా పరికరాలు.. గ్రామ భద్రతకు సోలార్ సీసీ కెమెరాలు

జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం మనవడు శివశంకర్ రెడ్డి సేవా కార్యక్రమాలు

మహబూబాబాద్, నవంబర్ 18: సేవ చేయడానికి పదవులు, హోదాలు అవసరం లేదని, సమాజానికి మేలు చేయాలనే సంకల్పం ఉంటే చాలని యువకుడు జన్నారెడ్డి శివశంకర్ రెడ్డి తన సేవా కార్యక్రమాల ద్వారా చాటిచెప్పారు. తన తాత, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం సుమారు రూ.2 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి 30 ఫ్యాన్లు, రోగులకు దుప్పట్లు, అరటి పండ్లు అందజేశారు. అనంతారం గ్రామంలో భద్రత కోసం సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు నాలుగు ప్రొజెక్టర్లు, విద్యార్థుల కోసం క్రీడా పరికరాలను అందించారు. గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తాత జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించినట్లు తెలిపారు. పాఠశాలలో ఆధునిక బోధనా విధానాలకు ప్రొజెక్టర్లు ఉపయోగపడతాయని, క్రీడా పరికరాలు విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్యాన్లు, దుప్పట్లు అందించినట్లు వివరించారు.

విద్యార్థుల అభ్యున్నతి, రోగుల సౌకర్యం, గ్రామ భద్రతను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలపై గ్రామస్తులు, పలువురు హర్షం వ్యక్తం చేశారు. తాత జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగిస్తున్న శివశంకర్ రెడ్డిని అభినందించారు.