BREAKING
ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
www.ntodaynews.com

శ్రావణ మాసం వచ్చేస్తోంది.. శుభ ముహూర్తాలకు కొదవే లేదు!

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 07:39 AM
31 వీక్షణలు

శ్రావణ మాసం వచ్చేస్తోంది.. శుభ ముహూర్తాలకు కొదవే లేదు!

  • పెళ్లి భాజాలు మోగనున్నాయ్.. కల్యాణ మండపాలకు పెరగనున్న డిమాండ్‌.. 10 వేలకుపైగా వివాహాలు జరిగే అవకాశం
  • ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు శ్రావణ మాసం

శుభకార్యాలకు పెట్టింది పేరు.. పండుగలకు నెలవు.. పెళ్లిళ్ల సందడికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు శ్రావణ మాసం కొనసాగనుంది. ఈ మాసంలో వరుసగా శుభ ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు కుటుంబాలు సిద్ధమవుతున్నాయి.

ముహూర్తాలు ఇవే..

పురోహితుల ప్రకారం ఆగస్టు నెలలో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలు శుభకార్యాలకు అనుకూలమైన రోజులుగా చెబుతున్నారు. సెప్టెంబరులో 3, 4, 5, 8, 10, 11, 13, 14 తేదీల్లో కూడా శుభ ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

పెళ్లి భాజాలకు సిద్ధం!

శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు వరుసగా ఉండటంతో ఇప్పటికే చాలామంది కుటుంబాలు వివాహ తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. దీంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, పూల అలంకరణలు, విందు ఏర్పాట్లు, వస్త్ర దుకాణాలు, బంగారు నగల వ్యాపారులకు భారీగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారాంతపు ముహూర్తాలకు మరింత డిమాండ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.

మండపాల దగ్గర సందడే సందడి!

ఒకవైపు పెళ్లి ముహూర్తాల కోసం కుటుంబాలు ఆరా తీస్తుండగా.. మరోవైపు కల్యాణ మండపాల నిర్వాహకులు కూడా ఏర్పాట్లలో బిజీ అవుతున్నారు. పెళ్లి భోజనాల నుంచి పూల అలంకరణల వరకు ప్రతి అంశానికీ ముందుగానే బుకింగ్‌లు చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో శ్రావణ మాసం ప్రారంభం నుంచే పెళ్లిళ్ల సందడి ఊపందుకోనుంది.

పదివేలకుపైగా పెళ్లిళ్లు?

ఈ శుభ ముహూర్తాల సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్‌గా మారనుంది. కుటుంబాల్లో మంగళ వాయిద్యాల సందడి.. కల్యాణ మండపాల్లో హడావుడి.. మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపించనుంది.

అయితే వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముహూర్తం నిర్ణయించే సమయంలో వధూవరుల జాతకాలు, జన్మ నక్షత్రాలు, ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పురోహితులు సూచిస్తున్నారు. కాబట్టి తుది ముహూర్తాన్ని సంబంధిత పురోహితుల సూచనతో నిర్ణయించుకోవడం మంచిది.