BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రావణ శుక్రవారం సందర్భంగా గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:07 PM
129 వీక్షణలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని పలు దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వామివారికి ఫలాలంకరణ, అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు టీ. గోపాలచార్యులు ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ ఎన్. సంధ్య, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గంపలగూడెం మండలం పెనుగొలను మెట్ట గుట్టపై ఉన్న శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు యోగానందాచార్యులు భక్తులచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పంది వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెనుగొలను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు దాములూరు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో లలితా దేవి పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.