బెల్లంకొండ జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్‌గా షేక్ ఈసుబ్
బెల్లంకొండ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్‌గా షేక్ ఈసుబ్, వైస్ చైర్మన్‌గా సందీపోగు మేరీ ఎన్నికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు, వివాదాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీఎస్‌కే మస్తాన్ షరీఫ్, మాజీ సర్పంచ్ సముద్రం, సయ్యద్ జానీ, నిడమానూరు పిచ్చయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ మజీద్, జబ్బార్, సందీపోగు లింగారావు, వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.