నాగబంధంలో సిద్ధేశ్వరాలయం.. రోజూ నాగుపాము దర్శనం
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ: హనుమకొండ నగరంలోని పురాతన సిద్ధేశ్వరాలయంలో రోజూ ఉదయం కనిపిస్తున్న నాగుపాము భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఆలయం తలుపులు తెరిచే సమయానికి గర్భగుడిలోని శివలింగం చుట్టూ నాగుపాము కనిపిస్తోందని ఆలయ పూజారులు చెబుతున్నారు.
పూజారుల వివరాల ప్రకారం.. గత 15 ఏళ్లుగా ప్రతిరోజూ ఉదయం నాగుపాము ఆలయానికి వచ్చి శివలింగం చుట్టూ ఉండి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుందని తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
ఈ ఆలయానికి నాగబంధం, భైరవబంధం రక్షణగా ఉన్నాయని స్థానికుల విశ్వాసమని పూజారులు తెలిపారు. నాగుపాము ఆలయానికి వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం శివలింగం చుట్టూ నాగుపాము కనిపిస్తోందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తులు తమకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాల మేరకు స్పందిస్తున్నారు.