BREAKING
thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం
Date of Publish : 04 October 2026, 11:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రత్యేక కేంద్రం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 11:59 AM
11 వీక్షణలు

పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రత్యేక కేంద్రం నవంబర్ 6 వరకు అవకాశం.. అర్హులందరూ నమోదు చేసుకోవాలి సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు పరిష్కారం

మధిర: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ముమ్మరం చేసినట్లు మధిర తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు తెలిపారు. ఈ మేరకు మధిర తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023 అక్టోబర్ 30 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 28న ప్రారంభమైన నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో మధిర మండలంలో 3,388 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఎస్‌ఐఆర్‌లో 8,261 మందికి ఓటరు గుర్తింపు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మండలంలో 9,394 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, 8,261 మంది అవసరమైన పత్రాలు సమర్పించడంతో వారిని తిరిగి ఓటర్లుగా నమోదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. మిగిలిన 1,133 మంది ఓటర్లు ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువపత్రాలను సమర్పిస్తే, నిబంధనల ప్రకారం వారినీ ఓటర్లుగా నమోదు చేస్తామని వెల్లడించారు.

సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్‌

మండలంలోని తొండలగోపవరం గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిందని రాంబాబు తెలిపారు. సిద్ధినేనిగూడెం, నాగవరప్పాడు, నక్కలగరువు, తొర్లపాడు గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని చెప్పారు. సమగ్ర భూ సర్వే పూర్తయితే భూముల హద్దులు, యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు తగ్గి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.