పీరజాదిగూడలో స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో ప్రారంభం
బోడుప్పల్ సర్కిల్ / Ntoday News
మల్కాజ్గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పీరజాది గూడా డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో బ్రాంచ్-7 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫిట్‌నెస్ స్టూడియోను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. ప్రజలకు మెరుగైన ఫిట్‌నెస్ సేవలు అందించేందుకు స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ అమర్ సింగ్, పీరజాదిగూడ, మేడిపల్లి డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీరాములు గౌడ్,తుంగతుర్తి రవి,కొత్త కిషోర్ గౌడ్, మాజీ మేయర్ శివ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.