BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 08 June 2026, 06:08 pm
Posted by : V శ్రీనివాస్

​టీజీ 20 లీగ్‌కు మంచిర్యాల, ఆసిఫాబాద్ కుర్రాళ్లు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:08 PM
89 వీక్షణలు

ఖమ్మం అన్విత ఏసెస్ ఫ్రాంచైజీకి సాయి కృష్ణారెడ్డి, ఆడె సంతోష్

టీజీ 20 క్రికెట్ లీగ్ కోసం ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులకు అదృష్టం వరించింది. స్థానిక యువ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై తమ ప్రతిభను చాటుకున్నారు.

​మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి కృష్ణారెడ్డిని అత్యధికంగా రూ. 1.80 లక్షలకు, అలాగే ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆడె సంతోష్‌ను రూ. 95 వేలకు కొనుగోలు చేశారు. వీరిద్దరినీ 'ఖమ్మం అన్విత ఏసెస్' ఫ్రాంచైజీ దక్కించుకుంది.

​ఇటీవల జరిగిన నాకౌట్ సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వారి ప్రతిభ ఆధారంగానే వేలంలో ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ టీజీ 20 లీగ్ ఈ నెల 21వ తేదీ నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. స్థానిక కుర్రాళ్లు లీగ్‌కు ఎంపికవ్వడం పట్ల జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.