BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:05 pm
Posted by : కూనురు మధు

టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరపాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Aug, 2026 - 08:05 PM
214 వీక్షణలు

టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరపాలి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం కోసం కేటాయించిన భూమి అన్యాక్రాంతంపై ఏసీబీ, విజిలెన్స్ శాఖలతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. భూమికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచాలని కోరారు. సుమారు 16 ఏళ్ల క్రితం చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం నిర్మించాలని కోరుతూ పెద్దలు, ప్రజలతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని సంజయ్ దాస్ గౌడ్ గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు ఆయన దీక్ష విరమించారని తెలిపారు. టీటీడీ కల్యాణ మండపం భూమి విషయంలో వాస్తవాలను వెలికితీయకుండా చిట్యాల మున్సిపల్ చైర్మన్ దంపతులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల చందాలతో భూమి కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్న నేపథ్యంలో 1.12 గుంటల భూమికి గజం భూమి తగ్గిన అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూమి కబ్జాకు గురైందా లేదా అన్న విషయాన్ని అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాలని కోరారు. ప్రభుత్వ భూమి, టీటీడీకి సంబంధించిన భూమి విషయంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చిట్యాల ప్రజలంతా ఈ అంశంపై సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించారు. టీటీడీ కల్యాణ మండపం భూమికి సంబంధించిన పాత రికార్డులు, గతంలో ఇచ్చిన హామీలు, భూమి కొలతలు, ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.