పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
వెల్గటూర్, సెప్టెంబర్ 17
తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాల ఫలితమని, ఆ నాడు నిజాం పాలన నుండి తెలంగాణను భారత యూనియన్‌లో విలీనం చేయడానికి కేంద్ర గృహనిర్మాణ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అమోఘమైనదని పాషిగామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం సంపత్ అన్నారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' (తెలంగాణ విలీన దినోత్సవం) పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం నీలం సంపత్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను 'ప్రజా పాలన దినోత్సవం'గా అధికారికంగా జరుపుకోవడం శుభపరిణామమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాండ్రఫ్ శిరీష, ఉపసర్పంచ్ భూమయ్య, పాఠశాల ఉపాధ్యాయులు మహేష్, ప్రణీత, కావేరి, అంగన్‌వాడీ టీచర్ రాజేశ్వరిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు