15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం
మహిళల్లోనూ తెలంగాణలో అధిక వినియోగం
హైదరాబాద్: NFHS-6 గణాంకాల ప్రకారం 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం అత్యధికంగా నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణలో 43.9 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పురుషుల్లో మద్యం వినియోగ సగటు 18.9 శాతంగా ఉంది.
మద్యం వినియోగంలో తెలంగాణ తర్వాత రాజస్థాన్ 42.2 శాతంతో రెండో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 38.3 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. జార్ఖండ్ 33.6 శాతం, మధ్యప్రదేశ్ 26.9 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మహిళల్లో మద్యం వినియోగంలో రాజస్థాన్ 19.9 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 7.1 శాతంతో రెండో స్థానంలో నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 5.7 శాతం, జార్ఖండ్‌లో 5.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.6 శాతం మహిళలు మద్యం వినియోగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం మరో కీలక అంశంగా గణాంకాలు సూచిస్తున్నాయి.