BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 06 October 2026, 02:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మరోసారి పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 02:19 PM
8 వీక్షణలు

దేశీయ టెలికాం రంగంలో మొబైల్ రీఛార్జ్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. రాబోయే 4–5 నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

5జీ నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ వ్యయాలు పెరగడం, వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU)ను పెంచుకోవాల్సిన అవసరం వంటి అంశాలు టారిఫ్ పెంపునకు కారణాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీఛార్జ్ ధరలు సుమారు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

టారిఫ్ పెంపు అమల్లోకి వస్తే మొబైల్ వినియోగదారుల నెలవారీ రీఛార్జ్ ఖర్చులు పెరగనున్నాయి. ముఖ్యంగా ఎక్కువ డేటా, దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లను వినియోగించే వారిపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే కంపెనీలు అధికారికంగా కొత్త ధరలను ప్రకటించే వరకు పెంపు శాతం, అమలు తేదీపై స్పష్టత ఉండదు.