తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్..
ఘట్‌కేసర్–కాజీపేట మధ్య 4వ రైల్వే లైన్
110 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ.2,418 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. కేంద్ర కేబినెట్ భేటీలో ఘట్‌కేసర్–కాజీపేట మధ్య 4వ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. సుమారు 110 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రూ.2,418 కోట్లను కేటాయించనున్నారు.
ఇప్పటికే సికింద్రాబాద్–వాడి మధ్య 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులతో తెలంగాణలో రైల్వే మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి.
కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయితే సరకు రవాణా, ప్రయాణికుల రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు రైళ్ల రాకపోకల్లో సమయపాలన మెరుగుపడే అవకాశం ఉంది. రద్దీ మార్గాల్లో అదనపు రైళ్లను నడిపేందుకు కూడా ఈ మౌలిక వసతులు దోహదపడనున్నాయి.
తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.