BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:31 PM
75 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. నైరుతి రుతుపవనాలు బలపడటంతో ఆగస్టు 23 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.