తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం
ఏపీకి అరవింద్ భదౌరియా.. సహ ఇన్‌ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్ | తెలంగాణకు సునీల్ బన్సల్.. సహ ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నూతన ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా అరవింద్ భదౌరియాను, సహ ఇన్‌ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించగా, సహ ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను నియమించింది. రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలను బలోపేతం చేయడం, నాయకత్వంతో సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నూతన ఇన్‌ఛార్జ్‌లు నిర్వహించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేలా అధిష్ఠానం ఈ మార్పులు చేపట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నూతన ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత కార్యక్రమాలు, నాయకులతో సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.