BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్‌కు కొత్త శోభ.. ప్రారంభానికి సిద్ధమైన 11 దుకాణాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
105 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శిధిలావస్థకు చేరిన షాపింగ్ కాంప్లెక్స్‌కు కొత్త రూపు వచ్చింది. ఆర్టీసీ ఆధీనంలోని 11 దుకాణాలతో కూడిన వ్యాపార సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది.

దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ పసుపులేటి శేఖర్ బాబు తన సొంత వ్యయ, ప్రయాసలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని పునర్నిర్మించి వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.

ప్రధాన సెంటర్‌లో ఉన్న ఈ వ్యాపార సముదాయాన్ని చిరు వ్యాపారులు, వినియోగదారులు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకుడు పసుపులేటి శేఖర్ బాబు తెలిపారు.

నిన్నటి వరకు చెత్త, చెదారం, వ్యర్థాలతో అధ్వాన్నంగా కనిపించిన ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, అతి త్వరలో వివిధ వ్యాపార సంస్థలు, వినియోగదారుల రాకతో సందడిగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.