BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 11:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో అంతర్గత రహదారుల నిర్మాణంలో జాప్యం ఎందుకు?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:54 AM
111 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి నగరంలోని అంతర్గత రహదారుల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ఎటు చూసినా అధ్వాన్నంగా మారిన రహదారులు ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు అంతర్గత రహదారులను నిర్లక్ష్యం చేశాయని విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నప్పటికీ, ప్రజలు నిత్యం ఉపయోగించే అంతర్గత రహదారులపై అదే స్థాయిలో దృష్టి ఎందుకు పెట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే చాలు రహదారుల దుస్థితి మరింత తీవ్రమవుతోంది. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణించడం ప్రజలకు సవాలుగా మారింది.

ముఖ్యంగా బట్టు వారి గూడెం, బాల వారి గూడెం రోడ్డు, దేవుడు మాన్యం కాలనీ, వెలంపేట కాలనీ, వడ్రిగూడెం కాలనీ, వైయస్సార్ కాలనీ ఎగువ, దిగువ ప్రాంతాలు, బట్టు వారి గూడెం పరిసరాలు, సుప్రియన్‌పేట, ఆర్కే నగర్, మోడల్ కాలనీ ప్రాంతాల్లో సరైన అంతర్గత రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, బురదమయమైన రోడ్లు, రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.