BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 August 2026, 07:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:03 AM
197 వీక్షణలు

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించకుండా వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్న వారిని చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్, అరవింద్ ఘోష్, బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదన్నారు.

వారు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందినప్పుడే మహనీయుల త్యాగాలకు నిజమైన గౌరవం దక్కుతుందని, పాలకులు ఆ దిశగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు గంజా కృష్ణమోహన్, ఉమ్మడి కృష్ణ జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, ఇజ్జాడ జగన్నాథం, పర్వతం రామారావు, పగుట్ల చంద్రయ్య, యద్దనపూడి రాములు, డేవిడ్, పల్నాటి సత్యనారాయణ, అజారుద్దీన్ షేక్, పులిపాటి దుర్గాప్రసాద్, కుంచం దినేష్, కుంచం చంద్రరావు, శివ, మత్తి మోహన్ రావు, గరికపాటి నరసింహారావు, డేవిడ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.