BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 16 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తండ్రి ప్యూన్, తల్లి పనిమనిషి.. అయినా 20 లక్షల ప్యాకేజీ సాధించిన రితికా సురిన్ సక్సెస్ స్టోరీ

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
144 వీక్షణలు

గ్రేటర్ నోయిడాలో ఎంబీఏ పూర్తి చేసిన రితికా సురిన్ అనే యువతి, తన పట్టుదలతో అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆమె కుటుంబం ఆర్థికంగా చాలా సాధారణ స్థితిలో ఉంది. తండ్రి ఒక ఆఫీస్ ప్యూన్‌గా, తల్లి ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని నడిపేవారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి ఆమె చదువుకు అడ్డంకి కాలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన రితికా, ఎలాగైనా మంచి స్థాయికి చేరి కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో కష్టపడి చదువుకుంది.

ఎంబీఏలో ప్రతిభ చూపిన ఆమె, ఇంటర్వ్యూల్లో కూడా తన నైపుణ్యంతో మెప్పించి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగాన్ని సాధించింది. ఈ విజయంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

పేదరికం అనేది అడ్డంకి కాదని, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని రితికా సురిన్ ప్రయాణం నిరూపిస్తోంది.