BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 March 2026, 10:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:30 PM
224 వీక్షణలు

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలోని తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన నలుగురు మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతానికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం శుక్రవారం ఉదయం వారు అందరూ కలిసి నదిలో స్నానానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఈత రాని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.