BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై డీఎంహెచ్ఓ తనిఖీలు

తెలంగాణ
30 Dec, 2025 - 10:33 AM
277 వీక్షణలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై డీఎంహెచ్ఓ తనిఖీలు

NTODAY NEWS: కరీంనగర్  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, పీఓ–ఎన్‌సీడీ డాక్టర్ ఉమాశ్రీలతో కలిసి సైదాపూర్ మరియు కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు, అవుట్‌పేషెంట్ రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రామిత వ్యాధిగ్రస్తుల వివరాల నమోదు, వారికి అందిస్తున్న మందుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ స్టోర్లలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను తనిఖీ చేశారు. పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్‌ఆర్‌ను పరిశీలించి, దానికి సంబంధించిన రోజువారీ ఉష్ణోగ్రత రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఐఈసీ బోర్డును పరిశీలించి, అందులో ప్రదర్శించిన అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులకు సంబంధించిన మందుల వివరాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వచ్చిన అవుట్‌పేషెంట్లతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో మహిళల రీ-స్క్రీనింగ్‌ను 100 శాతం పూర్తిచేసి, ఫాలోఅప్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. ప్రసూతి గది పరిశుభ్రతను పరిశీలించి, అందులో ఉండాల్సిన అత్యవసర మందుల లభ్యతను తనిఖీ చేశారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్లలో ఉన్న మందులను కూడా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందితో డెలివరీలపై సమీక్ష నిర్వహిస్తూ, పీహెచ్‌సీలలో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు, పీఓ–ఎన్‌సీడీ డాక్టర్ ఉమాశ్రీ, సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మీనాక్షి, కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్‌తో పాటు సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube