BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

గంజాయి రవాణా వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

తెలంగాణ
01 Apr, 2025 - 07:47 AM
97 వీక్షణలు
గంజాయి రవాణా, వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్, నిందితుల వద్ద నుండి 160 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక పల్సర్ బైక్ స్వాధీనం అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు: A-1: ముల్కలపల్లి రమేష్ @ కప్ప తండ్రి: కనకయ్య, వ: 21 సం.లు, కులం: మాదిగ, వృత్తి: పాన్ షాప్, నివాసం: చిన్నారావులపల్లి గ్రామం, బీబీనగర్ (మం). A-2: టేకుల మనీష్ తండ్రి: ఆంజనేయులు, వ: 23 సం.లు, కులం: బెస్త, వృత్తి: పాన్ షాప్ వర్కర్ @ఘట్కేసర్, నివాసం: అంబర్పేట్, హైదరాబాద్. JCL: వ: 17 సం.లు, నివాసం: కొండాపూర్, ఘట్కేసర్ చిన్నారావులపల్లి గ్రామానికి చెందిన A1 నిందితుడు ముల్కలపల్లి రమేష్ @ కప్ప తండ్రి: కనకయ్య, అంబర్పేట్, హైదరాబాద్ కు చెందిన A2 టేకుల మనీష్ తండ్రి: ఆంజనేయులు మరియు కొండాపూర్, ఘట్కేసర్ కు చెందిన మైనర్ బాలుడు అనే వ్యక్తులు ధూల్పేట్ లో సింగ్ అనే వ్యక్తి దగ్గర గంజాయిని తక్కువకు తీసుకువచ్చి చిన్న చిన్న పాకెట్ లు చేసి ఈ పాకెట్లను చుట్టుపక్కల గ్రామాలలో గంజాయి అలవాటు ఉన్న వారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిశ్చయించుకుని గంజాయిని ధూల్పేట్ నుండి కొనుగోలు చేసి అమ్ముతున్నారు. తేదీ.31.03.2025 రోజువారీగా ధూల్ పేట కి వెళ్ళి గంజాయి కొనుగోలు చేసి వస్తుండగా సాయంత్రం 06.30 గంటలకు బీబీనగర్ గ్రామ శివారు వద్ద బీబీనగర్ పోలీస్ వారు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు బజాజ్ పల్సర్, Br.No: TS-30-L-5174 ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ అనుమానస్పదంగా కనిపించి, పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 160 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక బజాజ్ పల్సర్ బైక్ ను స్వాదీనం చేసుకోవడం జరిగినది.గంజాయి సరఫరా చేసిన మరియు వినియోగించిన అది చట్టపరమైన నేరము, గంజాయి సంబంధించిన కేసుల్లో నిందితులు అలవాటుగా ఇలాంటి నేరాలకు పాల్పడితే సామాజిక రక్షణలో భాగంగా PD యాక్ట్ నమోదు చేసి ఎక్కువరోజులు జైలులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి సంభందించి పౌరులు, ప్రజలు పోలీసులకు సమాచారం డయల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు తెలుపవచ్చు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీస్ శాఖ ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, గంజాయి నిర్మూలనలో ప్రజలు పౌరులు అందరూ భాగస్వామ్యం కావాలని పోలీసులకు సహకరించగలరు. గంజాయి వినియోగించే వారిపై మరియు సరఫరా చేసే వారిపై ప్రత్యేకమైన నిఘా బృందాలను ఏర్పాటు చేయడం జరిగినది. సదరు నేరస్థులని పట్టుబడి చేసిన దాంట్లో యస్ ఐ లు ఎన్. రమేశ్, టి. అమర్ సింగ్,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ బి. రాము, పి. శ్రీనివాస్, జనార్ధన్ లు పాల్గొన్నారు. యం. ప్రభాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, బీబీనగర్ పి.యస్ Follow Us www.ntodaynews.com