BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 08:27 am
Posted by : SEETHA KIRAN KUMAR

మాండ్యలో విషాదం.. రైలు కింద పడి వివాహిత, యువకుడి మృతి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 08:27 AM
31 వీక్షణలు

వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ సమీపంలో ఘటన.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

కర్ణాటక (ఎన్ టుడే న్యూస్): కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి వివాహిత సహానా (25), రాహుల్ (23) మృతి చెందారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

సహానా ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ వీరేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. వీరు బెంగళూరులోని మదనాయకనహళ్లిలో నివాసం ఉంటున్నారు.

వారు నివసించే భవనంలోనే ఉంటున్న రాహుల్‌తో సహానాకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ విషయం భర్త వీరేష్‌కు తెలియడంతో సహానాను ప్రశ్నించి, రాహుల్‌కు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

భార్యాభర్తల మధ్య ఈ విషయమై విభేదాలు తలెత్తడంతో కుటుంబ పెద్దలు కూడా జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

దీంతో సహానా బెంగళూరు నుంచి మాండ్యలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రాహుల్ కూడా గురువారం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో సహానా కుటుంబంలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.