BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:38 pm
Posted by : K MAHESH

వీరభద్రస్వామిని దర్శించుకున్న టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 06:38 PM
21 వీక్షణలు

జర్నలిస్టులకు అండగా నిలవాలని స్వామివారిని వేడుకున్న నాయకులు

కురవి, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టులకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని, వారందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని ప్రార్థించినట్లు టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ తెలిపారు.

బుధవారం వీరభద్రస్వామి దర్శనానికి వచ్చిన రామ్ నారాయణకు టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గుంటి సురేష్, దాడుల నియంత్రణ కమిటీ కన్వీనర్ బేతమాల సహదేవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు అనుగోజు పూర్ణచంద్రరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా రామ్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐజేయూ జర్నలిస్టులందరికీ మంచి జరగాలని, వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణు, గందసిరి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా చౌదరి, ఖమ్మం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, దాడుల నియంత్రణ కమిటీ జిల్లా కో-కన్వీనర్ బేతమాల సహదేవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అనుగోజు పూర్ణచంద్రరావు, సిరోలు మండల ప్రధాన కార్యదర్శి మద్ది వీరన్న, మండల ఉపాధ్యక్షుడు గండమాల రోశయ్య తదితరులు పాల్గొన్నారు.