BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో విద్యుత్ షాక్‌కు రెండు గేదెలు బలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 07:05 PM
54 వీక్షణలు

అప్పు చేసి కొనుగోలు చేసిన గేదెలు మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై రెండు గేదెలు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన కల్లేపల్లి వెంకటేశ్వరరావు (పుల్లయ్య)కు చెందిన తోటలో పుల్లయ్య కాపలాదారుడిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవనోపాధి కోసం అప్పు చేసి రెండు గేదెలను కొనుగోలు చేసి, వాటిని తోటలో మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అయితే అనూహ్యంగా విద్యుత్ షాక్‌కు గురై రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో పుల్లయ్యతో పాటు కుటుంబ సభ్యులు గేదెల మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పు చేసి కొనుగోలు చేసిన గేదెలు మృతి చెందడంతో కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.

పుల్లయ్య కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నష్టానికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పర్వతాపురం గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదానికి దారితీసిన విద్యుత్ లోపాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.