BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 20 August 2026, 12:31 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్ల గ్రామంలో మద్యం బహిష్కరణకు ప్రజలంతా సహకరించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
20 Aug, 2026 - 12:31 PM
189 వీక్షణలు

ఉరుమడ్ల గ్రామంలో మద్యం బహిష్కరణకు ప్రజలంతా సహకరించాలి


ఉరుమడ్ల

ఉరుమడ్ల గ్రామంలో మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని గ్రామ యువజన నాయకుడు రామ్ జన్నపాల పిలుపునిచ్చారు.

మద్యం సేవించడం వల్ల కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మద్యానికి అలవాటు పడటం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

మద్యం వల్ల ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, మొత్తం కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడుతోందని రామ్ జన్నపాల అన్నారు.

మన గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం బహిష్కరణకు మహిళలు, యువత, పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మన కుటుంబాల కోసం.. మన పిల్లల భవిష్యత్తు కోసం.. మన గ్రామ అభివృద్ధి కోసం.. ఉరుమడ్ల గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామ్ జన్నపాల కోరారు.


ఇట్లు,

రామ్ జన్నపాల

గ్రామ యువజన నాయకుడు

ఉరుమడ్ల