BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేల్పుచర్లలో బెల్ట్ షాపు తొలగించాలని గ్రామస్తులు, మహిళల డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 11:32 PM
83 వీక్షణలు

వేల్పుచర్లలో బెల్ట్ షాపు తొలగించాలని గ్రామస్తులు, మహిళల డిమాండ్

ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, వేల్పుచర్ల, జూలై 25:

వేల్పుచర్ల గ్రామంలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ప్రాంతంలో కొల్లిపర్ర కుమార్ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్న బెల్ట్ షాపును వెంటనే తొలగించాలని గ్రామ మహిళలు, స్థానికులు శనివారం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు కుమార్ ఇంటి వద్దకు వెళ్లి, నివాస ప్రాంతంలో మద్యం విక్రయాలు చేయవద్దని, అవసరమైతే మరోచోట వ్యాపారం నిర్వహించుకోవాలని కుమార్ తండ్రికి విజ్ఞప్తి చేశారు.

మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వ్యక్తులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, దీంతో రోడ్డుపై నడిచే మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా బెల్ట్ షాపు సమీపంలో ఆంజనేయస్వామి మండపం ఉండటంతో భక్తులు, స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే బెల్ట్ షాపును తొలగించి చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కొల్లిపర్ర కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.