BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 July 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్ష

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
105 వీక్షణలు

 బిహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా మృతిచెందిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.


2018 డిసెంబరు 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో రాజుకుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ టైమ్‌లో అక్కడే ఉన్న డాక్టర్ అర్చనా గుప్తా(45) తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారామె. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గత జూన్‌లో రాజుకుమార్ సింగ్‌ను బీఎన్ఎస్-304(2) సహా ఆయుధ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని దోషిగా తేల్చింది.

అయితే.. శిక్షను ఖరారు చేసే సమయంలో రాజుకుమార్ సింగ్‌కు ఎలాంటి హత్యోద్దేశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరుండటంతో శిక్షను తగ్గించాలని కూడా కోర్టును కోరారు. అయితే.. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పు రాజుకుమార్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై ఏమేర ప్రభావం చూపుతుందనే విషయం చర్చనీయాంశమైంది.