BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 13 May 2026, 07:54 pm
Posted by : కూనురు మధు

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
13 May, 2026 - 07:54 PM
192 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం స్పష్టం చేశారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా "విద్యా రంగంపై అవగాహన" సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ​ఈ సందర్భంగా విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ విద్యార్థులకు వరంలా మారనున్న విద్యా ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు, అత్యుత్తమ బోధన ఒకే చోట అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. ​ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ​ఈ అవగాహన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా రంగ నిపుణులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.