BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 01:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థులకు కేంద్రం బంపర్ ఆఫర్.. గ్యారంటీ లేకుండా రూ.10 లక్షల విద్యా రుణం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:18 PM
127 వీక్షణలు

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్రం అమలు చేస్తున్న 'పీఎం విద్యాలక్ష్మి' పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందే అవకాశం కల్పిస్తోంది.

ఈ పథకం కింద ఎంపిక చేసిన ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు విద్యా రుణానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు కోర్సు కాలంతో పాటు అదనంగా ఒక సంవత్సరం వరకు 3 శాతం వడ్డీ రాయితీ అందించనున్నారు.

అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు పూర్తి వడ్డీ మినహాయింపు కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తైన తర్వాత 15 సంవత్సరాల వరకు రుణాన్ని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం కూడా ఈ పథకంలో ఉంది.