BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 09 September 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట : జగనన్న కాలనీ భూముల సమస్యలపై సీపీఎం నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:20 PM
9 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట : జగనన్న కాలనీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.

విస్సన్నపేటలో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలనీ భూములకు రెవెన్యూ అధికారులు సరైన సరిహద్దులు ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

భూములను అధికారిక కొలతల ప్రకారం సరిహద్దులు నిర్ధారించి, లబ్ధిదారులకు స్పష్టంగా అప్పగించాలని కోరారు. సరిహద్దులు లేకపోవడం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మండల రెవెన్యూ అధికారి కే. లక్ష్మీ కళ్యాణికి సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు విస్సంపల్లి నాగరాజు, మేకల జ్ఞాన రత్నం తదితరులు పాల్గొన్నారు.