BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 05 August 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట మండలంలో ఎల్‌నినో ప్రభావ నివారణపై రైతులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 05:41 PM
61 వీక్షణలు

విస్సన్నపేట, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని మోడరేట్ రిస్క్ గ్రామాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం నుంచి ఉద్యాన పంటలను సంరక్షించుకునే అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. శాలి రాజు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించాలని సూచించారు. ముఖ్యంగా ఫామ్ పాండ్ల ఏర్పాటు, డ్రిప్ సాగు విధానం, వీడ్ మ్యాట్ల వినియోగం, ముందస్తు వర్షాకాల విత్తనాలు, నేలలో తేమను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన మేరకు మాత్రమే నీటిని అందించడం వంటి చర్యలు పంటల రక్షణకు ఎంతో దోహదపడతాయని వివరించారు.

విస్సన్నపేట ఉద్యాన అధికారి బి. వాసవి సౌజన్య మాట్లాడుతూ, ఉద్యాన శాఖ ద్వారా ఫామ్ పాండ్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు నీటి సంరక్షణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఉద్యాన సహాయకుడు వెంకటేశ్వరరావు రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలు, ఎల్‌నినో సమయంలో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వివరించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలపై అవగాహన పొందారు.